ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో జరగనున్న పల్లె పండుగ 3.0 ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కందుకూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాము.మాజీ మంత్రి, సీనియర్ నాయకులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పరిశీలకులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కందుకూరు పట్టణంతో పాటు ఐదు మండలాల నుంచి 10 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాను.కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపడుతున్నాయి.కందుకూరు అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో కందుకూరు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *