ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో కూటమి నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమిష్టి కృషితో, పూర్తి సమన్వయంతో ఎదుర్కొని విజయాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కూటమి నాయకులు చర్చించారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, విద్యుత్ శాఖా మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రకాశం జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, శాసనమండలి సభ్యులు శ్రీ బీటీ నాయుడు గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, జిల్లా శాసనసభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *