శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, నివేదన, ప్రధాన హోమం, నిత్య హోమం, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, నీరాజనం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అలాగే అకల్మష హోమం, యాగశాల వాస్తు హోమం, రుత్విక్ వరణం, రక్షా సూత్రధారణ, విశేష స్నపన కార్యక్రమాలు జరిగాయి.శనివారం సాయంత్రం నిత్య హోమం, సర్వ దైవత్య హోమం అనంతరం స్వామివారి ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *