అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యం – గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొండేపి మండలం ముక్కోటిపాలెం గ్రామంలో ప్రకాశం జిల్లా పోలీసులు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.మర్రిపూడి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు తమ సిబ్బందితో కలిసి ముక్కోటిపాలెం గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు, ఇళ్లు మరియు పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడం, నేరాలను ముందస్తుగా నియంత్రించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం మరియు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం కోసం CASO ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతున్నాయి.
ప్రజల భద్రతే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.