ప్రకాశం జిల్లా ఎస్పి వి.హర్ష వర్ధన్ సూచనల మేరకు ఒంగోలు రాయపాటి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సింగరాయకొండ సీఐ వై శ్రీహరి సింగరాయకొండ లోని (వెంకటేశ్వర కాలనీ)రాజుల కాలనీ లో కార్డన్ సెర్చ్ ఆదివారం నిర్వహించారు. , జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజు సిబ్బంది 25 మంది పాల్గొన్నారు. వాహనాల తనిఖీలో ఎటువంటి కాగితాలను చూయించని 6 టూ వీలర్స్, అదుపులోనికి తీసుకుని, డాక్యుమెంట్స్ చూసి, వాహన యజమానులకు అప్పగించారు. గంజాయి అక్రమ రవాణా గురించి, గంజాయి వలన సామాన్య కుటుంబాలు సర్వ నాశనం అవటం వంటి విషయాలు గురించి వివరించారు. అదేవిధంగా ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల వలననే జరగటం చాలా బాదాకారం, హెల్మెట్ ఉపయోగిస్తే పచాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గి మరణాలు తగ్గుతాయని చెప్పారు. మరో ముఖ్య విషయం , సైబర్ నేరాలగురించి, దీనిలో చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా నేరాలు జరుగుతున్నాయనీ అన్నారు. చిన్న చిన్న తప్పిదాలతో, మెసేజ్ లతో డబ్బులు పోగొట్టుకోవటం బాగా జరుగుతుందన్నారు సైబర్ క్రైమ్ లో ఫోన్ లో ఎవరు ఏమి అడిగితే అలా ఓటిపిలు చెప్పకుండా, అనుమానం వచ్చిన వెంటనే లోకల్ పోలిసులకు సమాచారం ఇచ్చినట్లైతే మీకు సత్వర న్యాయం చేయగలం అని ప్రజలకు అవగాహన కల్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *