రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలను మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించడం జరుగుతోంది. గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో సెప్టెంబరు 29న జరగనున్న ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని జనసేన, బీజేపీ నాయకులతో సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లు, ప్రజా సమీకరణపై చర్చించాను.ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభ విజయవంతం చేయాలనీ తెలియజేశాను.మన పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి.సెప్టెంబరు 29న రామాపురం గ్రామానికి భారీగా తరలివచ్చి ‘పల్లె పండుగ 3.0’ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *