రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా – వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీలలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను గుర్తించి, బ్రెత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.“మద్యం సేవించి వాహనం నడపవద్దు – మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి” అని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *