సీనియర్ పాత్రికేయులు కావూరి సుబ్బారావు ఐదో వర్ధంతి ని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం లో శనివారం జరిగింది. కార్యక్రమంలో కావూరి సుబ్బారావు కుమారుడు కావూరి నవీన్ తోపాటు పలువురు ప్రముఖులుఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కమ్యూనిస్టు ఉద్యమంలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన వ్యక్తి కావూరి అని కొనియాడారు.
నగర అభివృద్ధికి సూచనలు,, సలహాలు ఇచ్చేవారన్నారు. అభివృద్ధి కమిటీలోనూ,, యువజన సంఘంలో విలువలతో పనిచేసి ఎంతో మందిని చైతన్యపరిచే వారని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వి.భక్తవత్సలం మాట్లాడుతూ నిబద్ధతగల జర్నలిస్టు కావూరి సుబ్బారావు అని అన్నారు.వార్తలను… ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా రాసే కావూరి మంచి విలువలు గల జర్నలిస్టు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
ఈ సందర్భంగా శివం శరణాలయంలో వృద్ధులకు,, శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలో 300 మంది పేదలకు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు జి. రమేష్. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ నాయకులు టి.భక్త సింగ్ రాజు. బత్తుల ముసలారెడ్డి. ఐద్వా నగర కార్యదర్శి జి. ఆదిలక్ష్మి. డాక్టర్ వి. మాలకొండయ్య. మెజీషియన్ రామన్. దన్నారపు మస్తాన్రావు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *