సింగరాయకొండకు చెందిన స్మార్ట్‌జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ఐదుగురు ప్రతిష్ఠాత్మక ‘హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్–2026’ సాధించి సత్తా చాటారు.ఈదర అమూల్య (గ్రేడ్ 9), ఈదర సుహాస్ర (గ్రేడ్ 6), కొల్లూరు తీక్షణ వెంకట శ్రీ (గ్రేడ్ 6), కొలపర్తి వెంకట సాయి ఆరాధ్య (గ్రేడ్ 6), గొట్టుల శ్రీ ప్రవస్థి ప్రియ (గ్రేడ్ ఈ) ఘనత సాధించారు.కూచిపూడి, భరతనాట్యం, సామాజిక సేవ, సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల్లో విద్యార్థులు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా హోప్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ రికార్డును ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్ HIBWR/2026/449గా పేర్కొన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, అంకితభావాన్ని అభినందిస్తూ సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాలను అందజేశారు.చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన విద్యార్థులను స్మార్ట్‌జెన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డా. గీతారాణి, చైర్మన్ శ్రీనివాసులు, జనరల్ మేనేజర్ హరిప్రసాద్ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నర్తన కళా నిలయం ప్రతినిధులు, సింగరాయకొండ ప్రముఖులు, కళాకారులు విద్యార్థులను అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *