తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మన ఒంగోలు నగరం 150 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించనున్న ఒంగోలు ఉత్సవం కార్యక్రమానికి అందరకీ ఆహ్వానం,తేదీ అనగా ఈరోజు : 30 సెప్టెంబర్ 2026, బుధవార సమయం: ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు వేదిక: మిని స్టేడియం,ఒంగోలు.మధ్యాహ్నం 3.30 గంటలకు మిని స్టేడియం వద్ద నుండి అద్దంకి బస్ స్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఒంగోలు గిత్తల ప్రదర్శన మరియు ఒంగోలు గిత్తల అందాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.మన నగర చరిత్ర, వారసత్వం, సంస్కృతి మరియు అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్ని మన ఒంగోలు 150 ఏళ్ల వైభవాన్ని అందరం కలిసి జరుపుకుందాం! ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ.ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ. చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, శ్రీ గొట్టిపాటి రవికుమార్, పలువురు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు,
ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.