కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతా హీ సేవా–2026” కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు–II వేలం కేంద్రం కార్యాలయ ప్రాంగణం నుండి పామూరు సర్కిల్ వరకు స్వచ్ఛతా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పొగాకు బోర్డు కార్యాలయ సిబ్బంది, పొగాకు కొనుగోలుదారులు (Buyers) మరియు పొగాకు రైతులు (Growers) పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా నినాదాలు మరియు అవగాహన సందేశాల ద్వారా ప్రజలకు తెలియజేశారు.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణాలు, వేలం కేంద్రం పరిసర ప్రాంతాలు మరియు ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, వ్యర్థాల తొలగింపు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను సరైన విధంగా వేరు చేసి నిర్వహించడం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
అలాగే పొగాకు రైతులు మరియు సంబంధిత వర్గాల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన గ్రామాలు, పరిశుభ్రమైన వ్యవసాయ క్షేత్రాలు మరియు పరిశుభ్రమైన వేలం కేంద్రాల దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛత అనేది కేవలం ఒక రోజు లేదా ఒక కార్యక్రమానికి పరిమితం కాకుండా నిరంతర సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
“స్వచ్ఛత మన బాధ్యత – పరిశుభ్రమైన పరిసరాలు మనందరి హక్కు” అనే సందేశంతో స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వేలం సూపరింటెండెంట్

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *