తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
ఒంగోలు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగిన ఎద్దుల ప్రదర్శన కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.సాంస్కృతిక సభా వేదిక వద్దకు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారితో కలిసి ఎద్దుల బండిపై డా. గొట్టిపాటి లక్ష్మీ గారు విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం ఒంగోలు ప్రాంతపు చారిత్రక వైభవంతో పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ప్రతిబింబించింది.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పన కుమారి గారు, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు.