చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విద్యార్థి తౌషిక్, అనంతరం తన కుమారుడికి న్యాయం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆయన తల్లి మౌలాబీ ఘటనల నేపథ్యంలో శుక్రవారం సింగరాయకొండలో సంఘీభావ సభ నిర్వహించారు.సింగరాయకొండ మండల ముస్లిమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సరస్వతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్త, పీస్ మెసేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బ్రదర్ సిరాజ్ ఉర్ రెహమాన్ హాజరయ్యారు.
తౌషిక్–మౌలాబీ కుటుంబానికి న్యాయం జరగాలనే ఆకాంక్షతో నిర్వహించిన ఈ సభలో ముస్లింలతో పాటు మానవతావాదులు, వివిధ వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.తౌషిక్ మృతిపై ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యేలా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, మౌలాబీ మరణానికి దారితీసిన పరిస్థితులపైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సభలో ప్రధానంగా వినిపించింది.“ఇది ఒక కుటుంబానికి సంబంధించిన బాధ మాత్రమే కాదు… న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి గొంతుక. తౌషిక్–మౌలాబీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంట నిలబడాలి” అనే సందేశంతో సభలో పాల్గొన్న వారు ఐక్యతను చాటారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *