కురిచేడు మండలం వినుకొండ R&B రోడ్డు – పడమర వీరాయపాలెం బీటీ రహదారి పనులకు డా. గొట్టిపాటి లక్ష్మీ గారు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ రహదారి పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.దర్శి నియోజకవర్గానికి పల్లె పండుగ 3.0 ద్వారా దాదాపు రూ.25 కోట్ల నిధులు కేటాయించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బావి మరమ్మతు, స్మశాన వాటిక స్థలం సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *