తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి మున్సిపాలిటీ 12వ వార్డులో రూ.85 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతి వార్డులో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం 12వ వార్డు కౌన్సిలర్ నక్క చంద్ర గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.