దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, సమాజ క్షేమాన్ని కాంక్షిస్తూ పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో వరుణ యాగం, వరుణ జపం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో జరిగిన ఈ యాగంలో, వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు సాగు బాగా జరిగి, చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నీటితో నిండి కళకళలాడాలని వరుణ దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కార్యనిర్వహణ అధికారి రంగరాజు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *