జరుగుమల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో తేదీ 21.10.2026 నుండి 23.10.2026 వరకు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడనున్నది.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) నిబంధనల ప్రకారం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జరుగుమల్లి పోలీస్ శాఖ సూచిస్తోంది.

  1. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రానికి రావాలి. అభ్యర్థితో కలిపి మొత్తం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  2. BNSS నిబంధనల ప్రకారం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను దృష్టిలో ఉంచుకొని, పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు.
  3. జరుగుమల్లి ఎంపీడీవో కార్యాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఉన్న కిరాణా దుకాణాలు, కూల్‌డ్రింక్స్ షాపులు మరియు ఇతర అన్ని రకాల దుకాణాలను నామినేషన్ల స్వీకరణ సమయంలో, ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మూసివేయాలి.
  4. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ఎవరూ అనవసరంగా గుమిగూడరాదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదు.
  5. ఎన్నికల నిబంధనలు, BNSS నిబంధనల ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులు, పోలీస్ శాఖ సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
    నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరడమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *