తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో రాజకీయ సమీకరణాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా మారాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి రాజకీయ ఎత్తులకు, వైసిపి విలవిలలాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ, గ్రామంలోని మెజారిటీ వర్గాలు, కార్యకర్తలు తెలుగుదేశం వైపు నడుస్తున్నాయి. ఇప్పటికే 60 కుటుంబాల వారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి సమక్షంలో టిడిపిలో చేరారు. కాగా గురువారం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మరో 14 కుటుంబాలు పసుపు కండువాలు కప్పుకున్నాయి. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చీమలదిన్నె నారాయణ, నూగుల మాల్యాద్రి, కేతినేని రత్తయ్య, పడిదపు వెంకటేశ్వర్లు, చీమలదిన్నె ఎరుకలయ్య, పడిదపు శ్రీనివాసరావు, మావుటూరి బ్రహ్మయ్య, బండి వేణు, చీమలదిన్నె నాగేంద్రబాబు, చీమలదిన్నె మాధవ, యనదాసరి సుధాకర్, చీమలదిన్నె కొండయ్య, పిచ్చపాటి బాలకొండారెడ్డి, పల్లాల బాలచెన్నయ్య కుటుంబాల వారు టిడిపిలో చేరారు. ZPTC, MPTC ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు వారికి సూచించారు. గ్రామ నాయకులు చుండూరి బ్రహ్మయ్య, నవులూరి రవీంద్ర, మార్నేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.