తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ:-
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాను.బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి అందె పెంచల ప్రత్యూష గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నాను.కూటమి ప్రభుత్వ హయాంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇదే అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులను ఆదరించి, భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.