ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది వివిధ ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు.ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *