ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.ఈ క్రమంలో ఎన్.జి. పాడు గ్రామంలో ఎన్.జి. పాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో, ఎస్.ఎన్. పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఎస్.ఎన్. పాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, అసాంఘిక శక్తులపై నిఘా ఉంచడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం వంటి లక్ష్యాలతో పోలీసులు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు సూచించారు. నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *