తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు వైసీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయన్న కారణంతో, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు కందుకూరు పట్టణ పోలీసులు మధుసూదన్ యాదవ్ కు నోటీసులు ఇచ్చారు. వైసిపి కార్యాలయంలో ఉన్న ఆయనను బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.