బుచ్చిరెడ్డిపాళెంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.75 లక్షలతో ఆధునిక సౌకర్యాలతో ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే రూ.20 లక్షలతో స్థలం కొనుగోలు చేశాం. ఎనిమిదో తరగతి తర్వాత చదువును కొనసాగించలేకపోతున్న మైనారిటీ బాలికలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే మా లక్ష్యం. అలాగే, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పడేందుకు బుచ్చిరెడ్డిపాళెంలో ఉర్దూ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా.‘చెప్పాం.. చేస్తున్నాం’ కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని 12, 13వ వార్డుల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాను. ముస్లిం మైనారిటీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం.ప్రజాసేవకు అంకితమైన దొడ్ల కుటుంబం నుంచి వచ్చిన దొడ్ల విజయలక్ష్మిని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ రహ్మత్ బాషా, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ పర్వీన్‌లను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలి. బుచ్చిరెడ్డిపాళెం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *