తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు ఏరియా ఆసుపత్రి నందు సోమవారం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఇంద్రాణి నూతనంగా ఆసుపత్రికి విచ్చేసిన గైనకాలజిస్ట్,డెర్మటాలజిస్ట్ డాక్టర్లను ఎమ్మెల్యే కి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో గైనకాలజీ, డెర్మటాలజీ డాక్టర్లు లేరని మహిళలకు సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలను గైనకాలజిస్టు దగ్గర, చర్మవ్యాధికి సంబంధించిన వాటిని డెర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్చేయించుకోవాలని,ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.