తొలి శుభోదయం కందుకూరు :-

కందుకూరు పట్టణంలోని టిఆర్ఆర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు శారీరక–మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలంటే ఆరోగ్యంగా ఉండాలని, అందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడల్లో పాల్గొన్న ఉపాధ్యాయులను ప్రోత్సహించి, విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *