తొలి శుభోదయం ప్రకాశం:-

గ్రామ స్థాయిలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంను అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామాల్లోనే రాత్రి గడుపుతూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలు, భద్రతాపరమైన ఆందోళనలను తెలుసుకుంటున్నారు. అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచడంతో పాటు, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.పోలీస్–ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంపొందిస్తూ, గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *