తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దోర్నాల సెంటర్‌లో విజిబుల్ పోలీసింగ్ మరియు ట్రాఫిక్ క్లియరెన్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, వాహనాల కదలికలను సవ్యంగా నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసుల ప్రత్యక్ష హాజరు ద్వారా ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండి, శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ నియంత్రణకు కట్టుబడి ఉంటారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *