తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పట్టణ పోలీసులు పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా చేపట్టారు.సోమవారం పట్టణ ఎస్.ఐ విశ్వనాథ రెడ్డి *జెడ్పీ బాలికల పాఠశాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాల ప్రారంభం, ముగింపు సమయాల్లో పోలీసు నిఘా కొనసాగుతుందని తెలిపారు.పాఠశాలల పరిసరాల్లో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ లేదా వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.విద్యార్థులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా వేధింపు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు