తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు కందుకూరు నియోజకవర్గంలో మనం చిత్తశుద్ధితో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పార్టీలో చేరిన పెద్దలు పులి తిరుపాలు గారు, మాజీ వార్డు సభ్యులు పులి రాజీవ్ గాంధీ గారు, సాధు చామంతి గారులతో పాటు కుటుంబ సభ్యులందరికీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను. వారందరికీ పార్టీలో ఎల్లప్పుడూ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చాను.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే ఒక్క పరకొండపాడు పంచాయతీ పరిధిలోనే ₹93 లక్షల విలువైన అభివృద్ధి పనులు, ₹7.6 కోట్ల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాం. ఇందులో భాగంగా పంచాయతీ, మండల పరిషత్ నిధులతో ₹22.19 లక్షలతో 15 పనులను పూర్తి చేయడమే కాకుండా, ₹15 లక్షల వ్యయంతో నాణ్యమైన సీసీ రోడ్లను నిర్మించాం. అలాగే ప్రతి నెలా 280 మంది లబ్ధిదారులకు దాదాపు ₹11 లక్షల పింఛన్లను ఠంచనుగా ఇంటి వద్దే అందజేస్తున్నాం. రాబోయే కాలంలో కొండారెడ్డిపాలెం ఎస్సీ కాలనీ సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరింత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని మాటిస్తున్నాను.