తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణం 26వ వార్డు మాజీ అధ్యక్షుడు అత్తంటి రత్తయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం ఆయనను పరామర్శించారు. రత్తయ్య నివాసానికి వెళ్లిన డాక్టర్ దివి శివరాం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రత్తయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట రాళ్లపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాకుమని మాధవరావు మాజీ ఎంపీపీ పొడపాటి శ్రీనివాసరావు టిడిపి నాయకులు సంగా రాము మరియు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.