ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా పోలీసు వారు అక్రిడేషన్ ఉంటేనే పోలీస్ వారి క్యూఆర్ కోడ్ కూడిన ప్రెస్ పాసులు మంజూరు చేస్తామంటూ ఇచ్చిన వాట్సప్ సమాచారముతో మరియు ప్రత్యేక్షంగా ఒంగోలు పట్టణంలో పలు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వారికి నోటీసులు జారీ చేయడంపై డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది.సోమవారం దీనిపై డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా కలెక్టర్ ను కలసి పోలీసు వారు యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వడంపై జిల్లా డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి జరుగుతున్న పరిణామాలతో వివరించారు.యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వారికి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండా డైరెక్ట్ గా వారికి నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.అలాగే పోలీసు వారు ఇస్తున్న క్యూఆర్ కోడ్ ప్రెస్ స్టిక్కర్లు. గుర్తింపు పొందిన యూట్యూబ్ చానల్స్ యాజమాన్యాలకి స్టిక్కర్లు మంజూరు చేయాలని. అలాగే భారత ప్రభుత్వం ఇచ్చిన చిన్న. మాస,వార,పక్ష రోజువారి పత్రికలకు ఎ.పి.టి.యల్. ఆర్.యన్.ఐ.కలిగి పత్రికల్లో పనిచేస్తున్న వారి యొక్క పత్రికా యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు ఐడెంటిటీ కార్డు కలిగిన వారికి కూడా పోలీస్ శాఖ వారు ప్రెస్ స్టిక్కర్స్ మంజూరు చేయాలని. అలాగే జిల్లాలో పనిచేస్తున్న పెద్ద పత్రికలు. చిన్న పత్రికలు
సాటిలైట్ ఛానల్స్ లో పనిచేస్తున్న వారితో సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టులతో ముఖాముఖి మాట్లాడి. పోలీస్ శాఖ వారు తీసుకున్న నిర్ణయాలను బహిర్గతంగా వివరించి తదుపరి. వర్క్oగ్ జర్నలిస్టులకు పోలీస్ స్టిక్కర్లు మంజూరు చేయాలని కలెక్టర్ కు వివరించారు.దీనిపై కలెక్టర్ స్పందించి జిల్లా ఎస్పీతో మాట్లాడి అందరికి న్యాయం చేస్తానని చెప్పారు. డి జే.యఫ్.తరపున త్వరలో జిల్లా ఎస్పీని ప్రత్యేకంగా కలిసి జరుగుతున్న పరిణామాలు వివరించి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని .డి. జే.యఫ్.జిల్లా అధ్యక్షులు జి.శివాజీ తెలిపారు.ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వయిజర్ యన్. రవికుమార్, డి.జే.యఫ్.రాష్ట్ర నాయకులు బి. శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు సతీష్ వై రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ నరేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *