జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని,ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం కందుకూరు శాఖ వారు చేస్తున్న
పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బుర్రా. మధుసూదన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రైవేటీకరణ ఆపే అంతవరకు మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో ముందుంటుందని అన్నారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖను ప్రైవేటుపరం చేయటం వలన దీని మీదే ఆధారపడి జీవిస్తున్న దస్తావేజులు రాసే లేఖరులు, స్టాంపు వెండర్స్, డి.టి.పి ఆపరేటర్లు జీవనోపాధిని కోల్పోయి పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 396 ను ఉపసంహరించుకొని ప్రైవేటీకరణను నిలుపుదలచేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వారు నూతనముగా ప్రవేశపెట్టిన జీవో ఎంఎస్ నెంబర్ 396 రద్దు ఉద్యమ కార్యక్రమాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని కందుకూరు సబ్ రిజిస్టర్ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు మరియు స్టాంప్ వెండర్లు వారు కోరిన మీదట రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 396 వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలకు కలిగే అసౌకర్యములను గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తిపై మీ సహాయ సహకారాలు కావాలని అడిగినందువలన ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నామని అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *