ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ గారు కందుకూరు ఎస్‌డీపీఓ కార్యాలయంలో సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కేసులు, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ట్రాఫిక్ అమలు చర్యలు తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు.పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తును వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు డీఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *