తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేలో ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక పార్టీతో కలిసి హైవేపై వాహనాల తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన సూచనలు అందించారు.హైవేపై పోలీసుల నిరంతర పర్యవేక్షణతో ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కొనసాగిస్తామని జిల్లా పోలీసులు తెలిపారు.