తొలి శుభోదయం ప్రకాశం:-
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద ప్రకాశం జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. తోపులాటలు, గుంపులుగా గుమిగూడే పరిస్థితులు ఏర్పడకుండా దేవాలయాల పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమబద్ధమైన క్యూలైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.అలాగే దేవాలయ ప్రాంగణాల్లో భక్తులు శాంతియుతంగా, నిబంధనలను పాటిస్తూ దర్శనం చేసుకునేలా పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.