google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గౌరవనీయులు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పీ రాజాబాబు ఐఏఎస్ , ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది. అలానే కలెక్టర్ , మాట్లాడుతూ సమాజంలో పిల్లల భాగం అని ఈ పిల్లలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బాల్యం అంటే చదువుకొని వృద్ధిలోకి రావడం అని పనిచేయడం కాదని తెలియజేశారు. ఎక్కడైనా పిల్లలు పనిచేస్తున్న ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే ఇటీవల bonded లేబర్ డ్రైవ్ లో చిక్కిన పిల్లలు వారి ఏజెంట్ల పై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ , గుర్తు చేసి ఉన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ర్యాలీని కలెక్టర్ ఆఫీస్ నుండే రిమ్స్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లేబర్ కమిషనర్ గౌస్ భాషా జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, AHTA SI నాగమణి,ఎన్జీవో పీ సునీల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *