తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఉన్న యూఐ (UI) పెండెన్సీ కేసులు, దర్యాప్తు పురోగతి మరియు పెండింగ్ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతతో పరిష్కరించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో విచారించి, చట్టపరమైన చర్యలను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు.స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, కేసుల పర్యవేక్షణ మరియు శాంతిభద్రతల అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు.