తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఆచూకీని గుర్తించి రికవరీ చేశారు. అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను దాని నిజమైన యజమానికి అప్పగించి బాధితుడికి ఊరటనిచ్చారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోగొట్టుకున్న వస్తువుల రికవరీ విషయంలో మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు.