google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

దొనకొండలో 25 వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు వారాల్లోగా భూముల సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు తెలిపారు. ఇప్పటికే BDL, APGEC, భవ్య ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయని తెలిపారు. భూసేకరణ, భూ సర్వే ప్రక్రియలను వేగవంతం చేసి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు. దొనకొండ మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసినవారికి బిల్లులను పూర్తిస్థాయిలో చెల్లించామన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *