google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా తర్లుపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు కేతగుడిపి గ్రామ శివారులో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 6 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,010 నగదును స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాలు, యువత మరియు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు. జిల్లాలో జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జూదం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *