తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు ఇత్తడి దీనమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉన్నత అధికారులు,నాయకులు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికురాలుగా గత 30 సంవత్సరాలుగా సింగరాయకొండ గ్రామపంచాయతీకి సేవలందించిన ఇత్తడి దీనమ్మ ను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. జయమణి , ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి & పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి పి శారద మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ యస్థాని, సుదర్సి చంటి గారు, మాజీ వార్డు సభ్యులు మరియు కార్మిక సంఘం నాయకులు పడిదపు రవి కుమార్ , జనసేన పార్టీ నాయకులు కాసుల శ్రీనివాసులు, గ్రామపంచాయతీ శానిటరీ మేస్త్రి సతీష్ బాబు పాల్గొన్నారు..