తొలి శుభోదయం ఒంగోలు :-
ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో రూ. 27 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మరియు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్ నిధులతో (రూ. 12.3 లక్షలు) ఆధునీకరించిన మినీ కాన్ఫరెన్స్ హాలును కూడా వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.