తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా పామూరు ప్రాంతంలో బహిరంగ మద్యం సేవన కేంద్రాలను (Open Drinking Places) తొలగించే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవనాన్ని పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి చర్యలు చేపట్టారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బహిరంగ మద్యం సేవనం చట్టరీత్యా నేరమని ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామాలు, పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు తెలియజేయాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *