ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి బుర్రాకు లేదు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలు , పేదలకు సంక్షేమ పథకాలు , రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారే తప్ప ప్రతిపక్షాల మెప్పుకోసం కాదనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని కందుకూరు నియోజకవర్గం ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని , సూపర్ సిక్స్ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నా ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని మౌనిక ఆవేదన వ్యక్తంచేశారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారని , తల్లికి వందనం పథకం సక్రమంగా అమలు చేస్తున్నారని , మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించారని ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని మౌనిక గుర్తుచేశారు. కందుకూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభివృద్ధి , సంక్షేమ పథకాలను అందిస్తున్నారని దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్యే పై దుష్ప్రచారం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణం కట్టుకొని ముందు వరుసలో ఉంటున్నారని మౌనిక ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలతో పాటు పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి కందుకూరు నియోజకవర్గానికి తీసుకోనివచ్చి అభివృద్ధి పథంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో కందుకూరు ను నిలబెట్టాలనే తపనతో పనిచేస్తున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు పై అవినీతి ఆరోపణలు చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే బుర్రాకు తగదని మౌనిక హెచ్చరించారు……