ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 48 ఫిర్యాదులు
తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్ మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను పోలీస్ అధికారులకు అందించి, వారియొక్క సమస్యలను వివరించారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల నేపథ్యాన్ని తెలుసుకొని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, కొండేపి సీఐ సోమశేఖర్, సంతమాగులూరు సీఐ టి.వెంకట్రావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
