తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతి పరిరక్షణ లక్ష్యంగా బహిరంగ మద్యం సేవన కేంద్రాల తొలగింపు (Open Drinking Places Cleaning) కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవన ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తిగా తొలగించడం జరిగింది. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలు సామాజిక శాంతికి భంగం కలిగిస్తాయని పోలీస్ అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, కుటుంబ వాతావరణం మరియు సమాజ శాంతిని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.ఎవరైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే నేరరహిత సమాజం సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
