తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని టిడ్కో కాలనీలో సోమవారం పోలీసులు విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 95 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తుల సంచారం, మత్తు పదార్థాల విక్రయం, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.