తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన లక్ష్యంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ పర్యవేక్షణలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని TIDCO హౌసింగ్ కాలనీలో విస్తృత స్థాయి కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌కు కందుకూరు సీఐ, గుడ్లూరు సీఐల నేతృత్వంలో సుమారు 60 మంది పోలీస్ సిబ్బంది సెర్చ్ టీమ్‌లు, కట్ ఆఫ్ టీమ్‌లుగా విభజించుకొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా 443 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 91 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిన వాహనాలను యజమానులకు తిరిగి అప్పగించగా, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధించారు.కార్డన్ & సెర్చ్ అనంతరం, కాలనీలో నివసించే ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడంతో పాటు యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.నేర నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, ప్రజా భద్రత లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు తెలియజేయాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *