తొలి శుభోదయం ప్రకాశం:-

తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగివేమన అని జిల్లా ఎస్పీ గారు కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలోని మూఢాచారాల నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త యోగివేమన అని, అత్యంత సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా నీతి, ధర్మాలను బోధించిన మహనీయుడు వేమన అని అన్నారు. ఆయన సూక్తులు సమాజ మార్పుకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని కొనియాడారు. మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్యసత్యాలను తనదైన శైలిలో తేటతెలుగు పదాలతో రచించి, తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయునిగా నిలిచిన ప్రజాకవి యోగివేమన అని తెలిపారు. సమాజంలోని కుల, మత వ్యత్యాసాలు, మూఢనమ్మకాలు, దురాచారాలను వ్యతిరేకించి సమాజానికి నీతి బోధించిన మహనీయుడు వేమన అని అన్నారు.వేమన పద్యాల్లోని జీవిత సత్యాలు నేటి కాలానికి ఎంతో అవసరమని, వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *