శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
తొలి శుభోదయం కందుకూరు:-

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని పెద్ద బజారు నందు ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు వాసవి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వం తరఫున గత సంవత్సరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి అధికారికంగా ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అమరజీవి జలధార అని నామకరణం చేయడం ఇది శుభ సూచికమని అన్నారు. అమరావతిలో అమరజీ స్మృతి వనానికి 7 ఎకరాలు స్థలాన్ని కేటాయించి, అందులో 58 అడుగుల అమర జీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం అమరజీవిని గౌరవించుకోవడమేనని అన్నారు. పెనుగొండను వాసవి పెనుగొండ గా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు, కూటమి ప్రభుత్వానికి ఉండాలని ఎమ్మెల్యే ఇంటూరి ఆకాంక్షించారు.అంతకుముందు ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు ఆలయం ప్రెసిడెంట్ కోట వెంకట నరసింహం ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఆలయ కమిటీ, ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, చక్కా వెంకట కేశవరావు, కోటా కిషోర్ బాబు, కాకుమాని ప్రవీణ్ కుమార్, కంకణాల వెంకటేశ్వర్లు, కొత్త వెంకటేశ్వర్లు, గుర్రం అల్లూరయ్య, చిన్న అల్లూరయ్య, పబ్బిశెట్టి వరదరాజ, ఇస్కాల మధు, మురారిశెట్టి వెంకటేష్ దేసు వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ఉన్నం వీరాస్వామి, చిలకపాటి మధుబాబు, పోకూరి రాంబాబు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
